Home తాజా వార్తలు నిరంతరం ప్రజల కోసం పని చేసిన మంత్రి మల్లారెడ్డికే ప్రజల మద్దతు

నిరంతరం ప్రజల కోసం పని చేసిన మంత్రి మల్లారెడ్డికే ప్రజల మద్దతు

by Telangana Express

-ఉపసర్పంచ్ ఉప్పు లింగేశ్వర్ రావ్…

ఘట్కేసర్,నవంబర్ 10(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎదులాబాద్ ఉపసర్పంచ్ ఉప్పు లింగేశ్వర్ కోరారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ పరిధిలోని పలు బస్తిల్లో గురువారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ పధకాలు కేసీఆర్ ప్రభుత్వం అందించిందని, తిరిగి సంక్షేమ పధకాలు పొందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఇతర పార్టీ నాయకులు చెప్పిన మాటలు నమ్మవద్దని, అభివృద్ధి అంటేనే కేసీఆర్ అని గుర్తు చేశారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని మంత్రి ఎంతో అభివృద్ధి చేశారని, సొంత నిధులు సహితం వెచ్చించి అభివృద్ధి చేశారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని అధిక మేజార్టీతో గెలిపించాలని అభ్యర్థిదించారు.
ఈ కార్యక్రమంలోగ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం శంకర్, కార్యదర్శి కొత్తన్ ఫోన్ చిరంజీవి ముదిరాజ్,మాజీ సర్పంచ్ బట్టె శంకర్,మాజీ ఎంపిటిసి మంకం రవి,బిఆర్ఎస్ నాయకులు ఎదుగని కృష్ణమూర్తి,కానుగంటి శ్రీనివాస్, బొట్టు రమేష్ కులసంఘాల నాయకులు,మహిళా కార్యకర్తలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment