Home తాజా వార్తలు బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

by Telangana Express

రాంపూర్ గ్రామ సర్పంచ్ భాస్కర్, చేగుంట సంద్రుగు శ్రీకాంత్ తో పాటు 15 మంది కార్యకర్తలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

చేగుంట నవంబర్ 9 తెలంగాణ ఎక్స్ ప్రెస్

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలలో యువకులు టిఆర్ఎస్ మరియు బిజెపి నాయకులు భారీ సంఖ్యలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశబైన భాస్కర్ మరియు సండ్రగు శ్రీకాంత్ తో పాటు అనేకమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన కార్యకర్త ఎక్కడ పోరు అని ప్రజలకు నమ్మకమైన నాయకుడిగా పని చేస్తూ ప్రజల మెప్పు పొంది గ్రామ సర్పంచిగా సేవలు చేసి మోసపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన భాస్కర్కు హృదయపూర్వక స్వాగతం అంటూ నా వెంటుండి నాపై నమ్మకం ఉంచి నా వెంట వస్తున్న భాస్కర్కు శ్రీకాంత్ లకు వారితో పాటు వివిధ పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలకు నమస్కారాలు దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే విజయం అని తెలిపారు

రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశ బోయిన భాస్కర్ మాట్లాడుతూ

నా జీవితంలో మొట్టమొదట ప్రజా నాయకుడు అంటే చెరుకు చెరుకు ముత్యంరెడ్డి వారి అడుగుజాడల్లో కాలక్రమమైన ఎదుగుతూ గ్రామ సర్పంచిగా అవకాశం పొందిన అనంతరం గ్రామానికి ఎంతగానో సేవ చేసిన నా మనసంతా కాంగ్రెస్ పార్టీ మరియు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పైనే ఉందని స్వర్గీయ దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గా అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు నా వంతు కృషి చేస్తానని రాజకీయంగా మరియు నడవడిక నేర్పిన ముత్యంరెడ్డికి ఎంతగానో రుణపడి ఉండాలని తెలిపారు


ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ రాంపూర్ గ్రామ సర్పంచ్ భాస్కర్ సండ్రుగు శ్రీకాంత్ స్టాలిన్ నరసింహులు చౌదరి శ్రీనివాస్ అన్న ఆంజనేయులు కొండి శ్రీనివాస్ శాంతాబాయి పెంటారెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వివిధ సేల్ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

You may also like

Leave a Comment