Home తాజా వార్తలు ఢీల్లి పార్టీలు రాష్ట్రంలో అధికారంలో వస్తేధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటున్నారు….కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు…. ప్రజా ఆశీర్వధ సభలో… కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్

ఢీల్లి పార్టీలు రాష్ట్రంలో అధికారంలో వస్తేధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటున్నారు….కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు…. ప్రజా ఆశీర్వధ సభలో… కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్

by V.Rajendernath

(వి.రాజేందర్ నాథ్)

హైదరాబాద్, నవంబర్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఢీల్లి పార్టీలు రాష్ట్రంలో అధికారంలో వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటున్నారని,
కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని
కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఆపద్ధర్మ సీఎం. కేసీఆర్ ఆరోపించారు. గురువారం కామారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ కామారెడ్డి బీఆర్ ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కు హాజరై మాట్లాడారు. డబ్బుల సంచులతో నగ్నంగా నడిరోడ్డుమీద దొరికిన ఒక దొంగ, నా మీద కామారెడ్డిలో పోటీ చేస్తాడట, ఓట్ల కోసం ఎవడెవడో వచ్చి అనేక ప్రలోభాలు పెట్టాలని చూస్తారు, అలాంటి ప్రలోభాలకు లొంగొద్దని కామారెడ్డి ప్రజలకు కేసీఆర్ పిలపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని వ్యాఖ్యానించారు. రైతులకు, భూ యజమానుల కష్టాలు తీర్చిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. ధరణి తో రౌతుల సమస్యలు తీరాయన్నారు. ధరణి లేని సమయంలో భూసమస్యలు వస్తే విఆరో ఓ నుండి రెవిన్యూ మినిస్టర్ వరకు తిరగాల్సిన దూస్థితి ఉండదన్నారు. ధరణి వల్ల ఆ సమస్య తీరిందన్నారు. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేంది? ఢిల్లీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను మళ్ళీ అన్ని రంగాల్లో వెనక్కి తీసుకొని పోతారన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు పట్టుబడుతుండడంతో ఈ వార్తలను ప్రజలు విశ్వసించే పరిస్థితి ఏర్పడిందన్నారు. దయచేసి చేసిన అభివృద్ధిని, చూడండి, బతుకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురికావొద్దని అన్నారు. అంతేకాదు.. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి తాము లబ్ది పొందాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఇస్తున్న హామీలు ఇస్తున్నాయి. ఆ పార్టీలు గతానికి భిన్నంగా కేటాయిస్తున్న సీట్లు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ బీసీలకు టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయ్యిందన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు ఇచ్చిన మాటను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. కామారెడ్డితో తనకు చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ కేసీఆర్ గతంలో కామారెడ్డిలో గడిపిన స్నేహితులను గుర్తు చేసుకున్నారు. కామారెడ్డిలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి మరింత చేస్తాం అన్నారు. దయచేసి మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. కామారెడ్డి ఎమ్యెల్యే గంపగోవర్ధన్ తన సీటును త్యాగం చేసి కామారెడ్డి అభివృధ్ధికోసం తనను కామారెడ్డి నుండి పోటీ చేయాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగుంటుందని అన్నారు. బంగారు తెలంగాణలో బంగారు కామారెడ్డి ని తయారు చేసుకుందాం అన్నారు. నా పుట్టుకతోనే కామారెడ్డి కి నాకు సంభంధం ఉందని అన్నారు.తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోనేనని, తన బాల్యం కూడా ఇక్కడే సాగిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజుల పాటు జలసాధన ఉద్యమం సాగిందని, నాడు మండలానికి ఒక బ్రిగేడియర్ ను నియమించుకుంటే తానే ఇక్కడ బ్రిగేడియర్ గా ఉన్నానన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ ఉద్యమానికి ఊపునిచ్చిందని తెలిపారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే వెంట చాలా వస్తాయని, కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు ఏడాదిన్నర రెండేళ్లలో పూర్తి చేసి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పారిస్తానని హామీ ఇచ్చారు.కేసీఆర్ వస్తే ఐటీ హబ్ లు వస్తాయని, విద్యుత్, ఎడ్యుకేషన్ సంస్థలు, పరిశ్రమలు వస్తాయన్నారు. కామారెడ్డి పట్టణ, పల్లెల రూపురేఖలు మారుస్తానన్నారు. గతంలో అధికారం ఇస్తే ఏం చేసాయి, ఇప్పుడిస్తే ఏం చేస్తాయో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను గతంలో కార్మిక మంత్రిగా ఉన్నానని దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే ఏనాడైనా వారిగురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 2014 కటాఫ్ డేట్ ఎత్తివేసి మిగిలిన లక్ష మంది బీడీ కార్మికులకు కూడా పింఛన్ ఇస్తామని తెలిపారు.సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేసారని, తెలంగాణ వచ్చాక కరెంట్ విషయంలో విజయం సాధించామని, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతులకు సమయానికి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నామని, పెట్టుబడి కోసం రైతుబంధు సాయం చేస్తున్నామని, రైతు చనిపోతే 5 లక్షల భీమా ఇస్తున్నామని తెలిపారు. మాజీ పిసిసి అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటున్నారన్నారు. బోర్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5 వేల కోట్లు నిధులు కట్ చేస్తామని కేంద్రం బెదిరించిన మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదని, 100 లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణపై పగబట్టి ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదన్నారు.

ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ నాయకుని నిలదీయాలని సూచించారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఎద్దు, ఎవసం తెలియని రాహుల్ గాంధీ చెప్తున్నారని, ధరణి పోర్టల్ రద్దు చేస్తే మళ్ళీ విఆర్వో, గిర్దావర్ వ్యవస్థ వచ్చి రైతులు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరనిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పిన వాళ్లనే బంగాళా ఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాగే పదేళ్ళలో తెలంగాణలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టుకోలేదని, ఒక్కరోజు కూడా కరువు రాలేదన్నారు. కలలో కూడా అనుకోని అనేక పథకాలు అమలు చేసుకున్నామని, 3 కోట్ల మందికి కంటివేలుగు ద్వారా పరీక్షలు చేసి 85 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చామన్నారు. కామారెడ్డిలో అభివృద్ధి జరగడానికి అన్ని వనరులు ఉన్నాయని, రాష్ట్రంలోనే కామారెడ్డి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి అవుతుందన్నారు.

ఈ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడ బీఆర్ ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీ ఆర్ ఎస్ సెంట్రల్ కమిటీ పెద్దలు కేశవరావు, జహీరాబాద్ ఎంపీ.బీబీ.పాటిల్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, కామారెడ్డి ఎమ్యెల్యే గంప గోవర్ధన్, జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ముజీబొద్దిన్, మాజీ.మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, జడ్పి చైర్ పర్సన్ దఫెదర్ శోభ, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, బీ ఆర్ ఎస్ నాయకులు దాదాపు 25వేలకు పైగా బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు.

You may also like

Leave a Comment