Home తాజా వార్తలు దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ

దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ

by Telangana Express
  • విద్యానగర్ కాలనీ అధ్యక్షులు ఏం.ఎ పాషా

ఆమనగల్లు, నవంబర్ 09
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ పట్టణంలోని సర్వే నెంబర్ 1457&1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు శుభవార్త గత ఏడు సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి విద్యానగర్ కాలనీ ఇండ్లు, ప్లాట్లు,పోలాలు గతంలోనే టైటిల్ కలిగిన అన్నింటినీ విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏం.ఎ పాషా మరియు కార్యవర్గ సభ్యుల నిరంతర కృషి వలన ప్రభుత్వ దేవాదాయ శాఖ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రాష్ట్ర మరియు రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగినది. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని సాధించడానికి నైతిక బలాన్ని తమ సహాయ సహకారాలు అందించిన విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గానికి సభ్యులకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏం.ఎ పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి సర్వే నెంబర్ 1457&1459 నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు కొనసాగించుటకు మరియు నిర్మాణ అనుమతులు ఇల్లు నిర్మించుకొనుటకు అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ కి విన్నవించడం జరిగింది.
సంబంధిత ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్ మహేశ్వరం కి ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ కి సమర్పించడం జరిగిందని కాలనీ అధ్యక్షులు ఏం.ఎ పాషా గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అద్యక్షులు ఏం.ఎ పాషా,ఉపాధ్యక్షులు వర్కాల శేఖర్, సెక్రటరీ జంగయ్య,కోశాధికారి సుదర్శన్ రెడ్డి,కమిటీ ముఖ్య సలహాదారు పాండు, కమిటీ సభ్యులు మ్యాక వేంకటేశ్వర రెడ్డి,పర్వతాలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment