Home తాజా వార్తలు హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ నామినేషన్

హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ నామినేషన్

by Telangana Express

పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి

సైదాపూర్ నవంబర్ 8
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,
మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నామినేషన్ ఘట్టం అట్టహాసంగా జరిగింది. మొదటగా పొన్నం దంపతులు పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో, హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుస్నాబాద్ లోని అనభేరి విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజక వర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి నామినేషన్ దాఖలు అందజేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి లు ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ
ఈ నియోజకవర్గంలో
పదేళ్ల టిఆర్ఎస్ అరాచకపు పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని అనుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, హుస్నాబాద్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ విషయంలో మాటిమాటికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడిందని ఆరోపణలు చేసే బిఆర్ఎస్, నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గం గత పాలకులైన దేశిని చిన మల్లయ్య, చాడ వెంకటరెడ్డి, ప్రవీణ్ రెడ్డి ల హయాం లోనే నని ఈ పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆశేష జన వాహిని కోలాహాలం లంబాడి నృత్యాలు డప్పు చప్పుల తో అభిమానులు అవదులేని సంతోషల మధ్య హుస్నాబాద్ అసెంబ్లీ అభ్యర్థి పొన్న ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి చాడ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ జిల్లా నాయకులు రాఘవులు శ్రీనివాస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య నాయకులు కొండారెడ్డి చైతన్య మల్లయ్య శ్రీనివాస్ రవీందర్ సందీప్ మల్లారెడ్డి రాజిరెడ్డి రవీందర్ మల్లేష్ రవీందర్ రెడ్డి వెంకటయ్య సంపత్ రాజు శ్రీనివాస్ మాజీ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మహిళలు యువకులు వృద్ధులు
పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు

You may also like

Leave a Comment