Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్ రాజ కొమురయ్య

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్ రాజ కొమురయ్య

by Telangana Express

వీణవంక, నవంబర్ 8 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ దూడపాక రాజ కొమురయ్య హుజురాబాద్ అభ్యర్థి వోడితెల ప్రణవ్ సమక్షంలో,సింగపూర్ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారితో పాటుగా వివిధ పార్టీల చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరూ
కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కార్యకర్తలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గొట్టే రాజయ్య, ప్రధాన కార్యదర్శి దాసారాపు సారయ్య, యార రాజయ్య, మిట్టపల్లి రవి, తిరుపతి,అప్పని శ్రీనివాస్,దాసారాపు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment