Home తాజా వార్తలు మేడ్చల్ గడ్డపై మల్లారెడ్డి గెలుపు ఎవరు అడ్డుకోలేరు – సర్పంచ్ వంగూరి శివశంకర్

మేడ్చల్ గడ్డపై మల్లారెడ్డి గెలుపు ఎవరు అడ్డుకోలేరు – సర్పంచ్ వంగూరి శివశంకర్

by Telangana Express

ఘట్కేసర్,నవంబర్ 05(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ గడ్డపై చామకూర మల్లారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని ప్రతాప్ సింగారం సర్పంచ్ వంగూరి శివశంకర్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగరాంలో బిఆర్ఎన్ నాయకులతో కలసి శనివారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసిన మంత్రి మల్లారెడ్డికి ప్రజలు అడుగడుగున బ్రహ్మారధం పడుతున్నారని గుర్తు చేశారు. మల్లారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమని అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, ఇట్టి పధకాలే గెలిపిస్తాయని తెలిపారు…
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొరుబోతు గోవర్ధన్, బీఆర్ఎన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవీన్ కుమార్, నాయకులు బండిరాల శివకుమార్, జున్ను శ్రీనివాస్ గౌడ్, మాగాని అంజనేయులు, జున్ను నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment