మిర్యాలగూడ నవంబర్ 5, (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదివారం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి రంగారెడ్డి పేరును ఖరారు చేశారు. పరిచయమే అక్కర్లేని రాజకీయ నేపథ్యం, మిర్యాలగూడనియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోనే కార్మిక, కర్షక, నాయకుడుగా “రంగన్న”కు పేరు గలదు. 1994 నుంచి ఇప్పటికి జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆరు సార్లు పోటీ చేసి “మూడుసార్లు ఎమ్మెల్యే”గా గెలుపొందిన విషయం తెలిసిందే. 2023 నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి సిపిఎం పార్టీ నుంచి మరోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తన వద్దకు వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కరింప చేసేందుకు కృషి చేసే నాయకుడుగా రంగన్న కు పేరు ఉంది.
👉సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి బయోడేటా
పేరు : జాలకంటి రంగారెడ్డి
తల్లిదండ్రులు. జూలకంటి కాశిరెడ్డి, లక్షమ్మ
పుట్టిన తేదీ. 04-03-1955
వయస్సు. 68 సం..
పుట్టిన ఊరు. కొత్తగూడెం, తిప్పర్తి మండలం
కుటుంబం. భార్య : సుజాత,
కుమారుడు : సుందర్
కుమార్తె : శైలేజా
చదువు : మెట్రిక్యులేషన్
ప్రజా ప్రాతినిధ్యం. 18.3.1987 నుంచి 17.3.1992 వరకు మున్సిపల్ వైస్ చైర్మన్,మిర్యాలగూడ
*1994 నుంచి 1999 వరకు మిర్యాలగూడ పాత నియోజకవర్గ ఎమ్మెల్యే
*2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే మిర్యాలగూడ
మొత్తం 3 పర్యాయాలు ఎమ్మెల్యే గా పనిచేశారు.
పార్టీలో ప్రాతినిధ్యo. 1978 లో పార్టీలో చేరిక
6 సంవత్సరాల పాటు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడుగా
పది సంవత్సరాలు సిఐటియు జిల్లా అధ్యక్షుడిగా
- పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. దీనితోపాటు అఖిల భారత కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
