Home తాజా వార్తలు 30 కోట్లకు ఎల్లారెడ్డి ప్రజలను కేసిఆర్ కు తాకట్టు పెట్టిన జాజాల సురేందర్బీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల మదన్ మోహన్ రావు

30 కోట్లకు ఎల్లారెడ్డి ప్రజలను కేసిఆర్ కు తాకట్టు పెట్టిన జాజాల సురేందర్బీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల మదన్ మోహన్ రావు

by V.Rajendernath

కామ్మారెడ్డి, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
30 కోట్లకు ఎల్లారెడ్డి ప్రజలను కేసిఆర్ కు ఎమ్యెల్యే జాజాల సురేందర్ తాకట్టు పెట్టారని ఎల్లారెడ్డి అసెంబ్లీ
బీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల మదన్ మోహన్ రావు ఆరోపించారు. శనివారం ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్ లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో తన అనుచర వర్గాన్ని, తన వెంట ఉన్న బీజేపీ నాయకులను మదన్ మోహన్ రావు వర్గంలో కలిపి వేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. నీకు నేను నాకు నువ్వు అనే కాన్సెప్ట్ తో మాజీ ఎమ్యెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్ స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా మదన్ మోహన్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ అని,
కాంగ్రెస్ ప్రభంజనం ముందు ఎమ్మెల్యే జాజాల నిలబడలేడని,
కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు.
సొంత పైసలతో ఎల్లారెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించా,
టిఆర్ఎస్ పాలనలో సురేందర్ రెడ్డి ఒక్కడికే ఉద్యోగం దక్కింది
నేను పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్చుకోలేక పోయిన దుర్మార్గుడు ఎమ్మెల్యే జాజుల
డిసెంబర్ మూడో తారీకున జాజాల రాజకీయ జీవితం భూస్థాపితం అన్నారు.
ఎమ్మెల్యేగా నా జీతాన్ని ఎల్లారెడ్డి ప్రజలకు ఖర్చు చేస్తా
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. డబ్బు సంచితలతో గెలవాలని చూస్తున్నా సురేందర్ కు ఎల్లారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలి.
ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించాలి.
బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఘన విజయం సాధిస్తాడు.
ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా అన్నారు.
మదన్ మోహన్ మాట ఇస్తే తప్పిన చరిత్ర లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. అనంతరం
ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే
ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలు ఎమ్యెల్యే సురేందర్ ను అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలు
చందాలు వేసుకొని గెలిపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన చరిత్ర సురేందర్ కు ఉందన్నారు. మదన్ మోహన్ ను ఎల్లారెడ్డి ప్రజలు ఆదరిస్తున్నారు.
భారీ మెజార్టీతో మదన్మోహన్ గెలుపు ఖాయం.
ఎల్లారెడ్డిలో మదన్మోహన్ బాన్సువాడలో నేను గాడిదల పనిచేసి కాంగ్రెస్ ను గెలిపిస్తాం అన్నారు.

You may also like

Leave a Comment