Home తాజా వార్తలు గ్రామాలలో గుబాలించిన గులాబీ దండు

గ్రామాలలో గుబాలించిన గులాబీ దండు

by Telangana Express

బతుకమ్మ ఆటపాటల కోలాటంతో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ కు ప్రజల ఘన స్వాగతం..

చిగురుమామిడి నవంబర్ 4
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

చిగురు మండల పరిధిలోని నవాబుపేట గాగిరెడ్డిపల్లి గురుకులపల్లి ఇందుర్తి ఓబులాపూర్ లంబాడి పల్లి సీతారాంపూర్ గ్రామాలలో రెండోదప ఎన్నికల ప్రచారం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో అభ్యర్థి ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తుందని తెలిపారు గత పాలకుల పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం కోసం రహదారులను ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని పేర్కొన్నారు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతన్ననికి సాగునీరు కోసం కాలువల ద్వారా గోదావరి జలాలను అందించిందని మరిన్ని ప్రాజెక్టులు నిర్వహించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం ఉన్నదని తెలిపారు మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత నిచ్చి మహిళలను చైతన్య పరుస్తుందని చెప్పారు ముచ్చటగా మూడవసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చానని ఆశీర్వదించండి మూడోసారి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు అందించుటకు మూఢ సంకల్పంతో ప్రభుత్వ ఉన్నదని కెసిఆర్ మరోసారి సీఎం అయిన తర్వాత అన్ని హామీలను కచ్చితంగా అమలు పరుస్తామని హామీ ఇచ్చారు రైతుబంధు రైతు బీమా తో పాటు రుణమాఫీ తప్పకుండా విడుదల చేస్తామని రైతులకు భరోసానిచ్చారు సామాన్యుడు సంక్షేమమే కేసీఆర్ లక్షమని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేసీఆర్ బీమా కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అన్నపూర్ణ పథకం కింద అందించడం జరుగుతుందని అలాగే మహిళా సమాఖ్య సొంత భవనాల ఏర్పాటు మహిళలకు 400 కే గ్యాస్ సిలిండర్ సౌభాగ్య లక్ష్మి కింద వేద మహిళలకు జీవన భృతి కెసిఆర్ ఆరోగ్య రక్ష కింద 15 లక్షల ఆరోగ్య భీమ అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలో మైనార్టీ సంక్షేమం పథకం కింద గురుకుల జూనియర్ కళాశాలలను డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి సింగిల్బండ వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ బి రాజ్ రెడ్డి మాజీ వైఎస్ ఎంపీపీ అందే సుజాత టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి సర్పంచులు సుద్దాల ప్రవీణ్ సన్నిల వెంకటేశం జక్కుల రవి బెజ్జంకి లక్ష్మణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజు రజిత మాజీ మండల అధ్యక్షులు రామోజీ కృష్ణమాచారి ఎంపిటిసి మిట్టపల్లి మల్లేశం వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళా సంఘాల నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment