బిఆర్ఎస్ యువజన మైనార్టీ నాయకులు అర్షద్ ఖాన్
కల్వకుర్తి, నవంబర్ 04
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
కల్వకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, జైపాల్ యాదవ్ ను భారీ మెజారిటీ తో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని ఎడ్మ సత్యం యువసేన నాయకులు, బిఆర్ఎస్ యువజన మైనార్టీ నాయకులు అర్షద్ ఖాన్ తెలిపారు.అభివృద్ధి, సంక్షేమానికి బంగారు బాటలు వేసిన బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని,ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాబట్టే బీఆర్‌ఎస్ కు ఎదురులేదు..సీఎం కేసీఆర్, అభ్యర్థి జైపాల్ యాదవ్ కు తిరుగులేదన్నారు.కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటి రోజులు తప్పవన్నారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడమే తమ ధ్యేయమన్నారు.