Home తాజా వార్తలు బారాస పార్టీకి ఎంపీటీసీ రాజీనామా

బారాస పార్టీకి ఎంపీటీసీ రాజీనామా

by Telangana Express

బీబీపేట్ నవంబర్ 2 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )బారాస పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని ,అధికారికంగా ,అనధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారని చెబుతూ బీబీపేట్ -2 ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ఇటీవల బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది .వివరాల్లోకి వెళితే అధికార పార్టీకి చెందిన కొరివి నీరజ నర్సింలు బీబీపేట్ ఎంపీటీసీ -2 ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు .ఈమె గత ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నుండి గెలుపొంది పరిస్థితుల కారణంగా బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరారు .అయితే ఇటీవల తమకు పార్టీలో తగిన గుర్తింపు లేకుండా పోయిందని ,ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే నెపంతో నే గాకుండా పలు విషయాల్లో తమను చిన్న చూపు చూస్తున్నారని చెబుతూ నామిటెడ్ పోస్టులద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకే గుర్తింపు ఇస్తున్నారని ,ప్రజల చేత ఎన్నుకోబడ్డ తమను గుర్తించడం లేదంటూ మనస్తాపానికి గురౌతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో బీ ఆర్ ఎస్ పార్టీ పై పలు విమర్శలు చేయడంతో అందరి దృష్టి ఆమె రాజకీయం వైపే సారించారన్నది సుస్పష్టం .బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా ? లేక ఇతరతర పార్టీలో చేరబోతున్నారా?అన్న ప్రశ్నలు మండలంలో తలెత్తుతున్నాయి

You may also like

Leave a Comment