ఆమనగల్లు,నవంబర్ 02
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి గెలుపు కోసం గురువారం ఆమనగల్లు మున్సిపాలిటీలో డోర్ టూ డోర్, షాప్ టూ షాప్ ప్రచారం చేస్తూ ఆచారీని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య,బిజెపి నాయకులు శ్రీశైలం బైకని యాదవ్, గోరటి నర్సింహా, నాగిళ్ళ లక్ష్మణ్, వడ్డే రాజు, జెజ్జాల గిరి, సుక్క హరినాథ్, మాండన్ శ్రీకాంత సింగ్, ముక్కరి వెంకటేష్, బండమిది మహేష్ తదితరులు పాల్గొన్నారు.

