-ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
సైదాపూర్ నవంబర్ 2
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సైదాపూర్/ బిఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, మూడోసారి ఎమ్మెల్యేగా సతీష్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లస్మన్న పల్లి గ్రామంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, వార్డు సభ్యులు రేగుల సురేష్ ,మాతంగి వెంకటయ్య ,కోఆప్షన్ సభ్యులు పెసర అశోక్ కొట్టే వెంకటరెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ దోనపాటి రాంరెడ్డి, నాయకులు నాంపల్లి భూపతి, తిప్పబత్తని శ్రీనివాస్, బండ మల్లారెడ్డి ,తలారి విష్ణు ,నాంపల్లి మణికంఠ ,తలారి రాము తదితరులు పాల్గొన్నారు.