Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

by Telangana Express

శంకరపట్నం,నవంబర్ 02:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన పలువురు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ ఉపసర్పంచ్ తుమ్మ వెంకటపతి మరియు వార్డు సభ్యుడు నర్సింగోజు మనోచారి,నాయకులు నర్సింగోజు సంతోష్, పెద్దపేట రాజు కాంగ్రెస్ పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు, మానకొండూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట తిరుపతి రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పెంట సాంబయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్ కుమార్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కల్లూరి సంతోష్, గాజుల మహేష్, రాయిని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment