Home తాజా వార్తలు సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు

by Telangana Express

నకిలీ మెసేజస్ నమ్మి మోసపోకండి ఏసీపీ డాక్టర్ రాజేష్

మంచిర్యాల, నవంబర్ 02, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు ఈ అవగాహనా కార్యక్రమం మంచి పరిణామమని సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ డిఐజి ఆదేశాల మేరకు జాగృతి దివాస్ కార్యక్రమం లో భాగంగా మంచిర్యాల లోని వివేకావర్దిని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై, సైబర్ క్రైమ్ ఏసీపీ రాజేష్, సీఐ మహేందర్ గార్ల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్ గౌ ఇన్ సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, ప్రతి ఇంటిలో తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల, గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment