Home తాజా వార్తలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని గెలిపించాలి. సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని గెలిపించాలి. సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం…

by V.Rajendernath

ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్

కామారెడ్డిజిల్లా నవంబర్ 1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

సోనియాగాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ కోరారు. బుధవారం నాడు రామారెడ్డి మండల కేంద్రంలో గడపగడపకు
మదన్ మోహన్ కార్యక్రమం నిర్వహించారు.
కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు ఆదరణతో గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు. యువతకు ఉద్యోగ కల్పన
పేదలకు సొంత ఇంటి
సాకారంకోసం అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. 60 మంది యాదవ సంఘ సభ్యులు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. గులాబీ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు బీసీ బందు మైనారిటీ బందు పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో కొస్తే
6 గ్యారెంటీ హామీలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. ప్రతి మహిళకు నెలకు 3వేలు
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంఎ
రైతులకు ఏడాదికి 15వేలు, రైతు కూలీలకు 12వేలు,
500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ ఆపత్కాలంలో వందల మంది ప్రాణాలు
కాపాడానని
మదన్ మోహన్ చెప్పారు. గ్రామ గ్రామాన అంబులెన్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. రామారెడ్డిలో కనీస సౌకర్యాలు లేవని
రోడ్లు మురికికాలువలు లేవన్నారు
డబుల్ బెడ్రూoలు యువతకు ఉద్యోగాలు లేవని గుర్తు చేశారు. 30 ఏళ్ల క్రితం రామారెడ్డి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. తాను గెలిచి అమెరికా పోతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మదన్ మోహన్ చెప్పారు. జాబ్ మేళాలు నిర్వహించి వందల మంది యువతకి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 18 దేశాలలో సొంత కంపెనీలు ఉన్న
ప్రజా సేవ కోసం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని
ప్రజాసేవకు అంకితం అవుతానని హామీ ఇచ్చారు.

మీ మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్లారెడ్డి

You may also like

Leave a Comment