తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం
మద్నూర్ నవంబర్ 1:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ లో విద్యార్థిని వసుధ అనుమానస్పద మృతి పట్ల విచారణ జరపాలని తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల నీలకంఠం ముదిరాజ్ డిమాండ్ చేశారు.బిచ్కుంద మండలం లోని మాన్యపూర్ గ్రామానికి వచ్చి
బాధిత కుటుంబాన్ని ఆయన రాష్ట్ర ముదిరాజ్ సంఘ నాయకునిగా పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని యెడల భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠం, ముదిరాజ్ జర్నలిస్టు సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ సదా పవన్, శ్రీనివాస్ BC జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆంజనేయులు టిడిపి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ మహేష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.