Home తాజా వార్తలు అపోలో ఒకేషనల్ కళాశాలలో పూర్వ విద్యార్థికి కానిస్టేబుల్ ఉద్యోగం.

అపోలో ఒకేషనల్ కళాశాలలో పూర్వ విద్యార్థికి కానిస్టేబుల్ ఉద్యోగం.

by Telangana Express

హుస్నాబాద్ నవంబర్1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

హుస్నాబాద్ పట్టణంలోని ఆపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి భూక్య భరతనాయక్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో బెటాలియన్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగ అర్హత సాధించాడాని కళాశాల ప్రిన్సిపాల్ వేముల గణేష్, తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో చదివి ఉద్యోగం సాధించిన భూక్య భరత్ నాయక్ కు , కళాశాల ప్రిన్సిపాల్ వేముల గణేష్, అధ్యాపక బృందంతో కలసి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోని దానిని సాధించడానికి కష్టపడి విజయం అందుకోవాలని అన్నారు. తమ కళాశాలలో చదువుకుని ఉద్యోగం సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వేముల అంజయ్య,పూర్వ అధ్యాపకుడు రమేష్ నాయక్ అధ్యాపక బృందం మమత, ప్రవీణ్, రాజేంద్రప్రసాద్, సుజాత, అధ్యాపకేతర బృందం శేఖర్,అరుణ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment