(తెలంగాణఎక్స్ ప్రెస్ ) 24/10/23. భై0న్సా మండలం కేంద్రం లో ని అసమానతలకు తావులేకుండా బౌద్ధం సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వాన్ని పంచుతూ వ్యక్తులను శాంతి మార్గంలో నడిపిస్తుందని భారతీయ బౌద్ధ మహాసభ భైంసా శాఖ అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే అన్నారు బైంసాలోని బుద్ధ విహార్లలో, వివిధ కాలనీలలో మంగళవారం రోజున ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బైంసా శాఖ ఆధ్వర్యంలో 67 వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గౌతమ బుద్ధుని, సామ్రాట్ అశోక చక్రవర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి దీప దూప పూజలు నిర్వహించి బౌద్ధ పంచశీల్ ధమ్మధ్వజ్, నీలి పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామ్రాట్ అశోక చక్రవర్తి ఇదే రోజు బౌద్ధ ధమ్మని,అదేవిధంగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్ పూర్ లో బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్నారని తెలిపారు అంబేద్కర్ దీక్ష స్వీకరణ ఉద్దేశాన్ని వివరించారు చెడును వీడి మంచి మార్గంలో నడుచుకోవడమే పరివర్తన అని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాహుల పోషట్టి, బిఎస్ఐ భైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే, కె.రాజేందర్, ప్రసాద్ హసడే, బి.దమ్మచంద్రా, చరణ్, ఆకాష్, ప్రజా ప్రతినిధులు, బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు మరియు మాజీ శ్రామినర్, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు, సమస్త బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు,పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ధమ్మచక్ర పరివర్తన దినోత్సవం
66
previous post