Home తాజా వార్తలు గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు….

గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, అక్టోబర్ 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు, ఆదివారం మండలంలోని అల్మాజిపూర్, కొక్కొండ, అడివిలింగాల, వెంకటపూర్, వెల్లుట్ల, సోమార్ పేట్, అన్నసాగర్, సోమర్యగడి తాండా, తదితర గ్రామాలతో పాటు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 5 వ వార్డు కింద గల గండిమాసాని పేట్ గ్రామంలో మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి పూలతో బతుకమ్మలను సుందరంగా తయారు చేసి, గ్రామాల కూడళ్లలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు లయబద్దంగా బతుకమ్మ ఆటలు ఆడారు. ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ అల్మాజిపూర్ గ్రామంలో, మహిళా సర్పంచులు బొయిని భూమవ్వ, సువర్ణ, గౌలపల్లి సురేఖ, గంట రాజేశ్వరి, ఇందిర లు ఆయా గ్రామాల్లో మహిళలతో కలిసి బతుకమ్మల ఆటలు ఆడారు. మహిళా ఎంపిటిసి సభ్యులు దనవత్ లక్ష్మి, సుతారీ లక్ష్మి, జంగిటి ఉమాదేవి లు సైతం వారి గ్రామాల్లో మహిళలతో కలిసి బతుకమ్మల ఆటలు ఆడి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను సమీప చెరువుల్లో, పోచారం ప్రధాన కాలువలో నిమజ్జనం చేశారు. వారి వెంట తీసుకు వచ్చిన తినుబండారాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించి, బతుకమ్మ తల్లిని పాటల రూపంలో కొలుస్తూ ఇంటికి చేరుకున్నారు. సద్దుల బతుకమ్మ సంబరాలతో గ్రామాల్లో సందడి నెలకొంది.

You may also like

Leave a Comment