నిజాంసాగర్ అక్టోబర్ 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మహమ్మద్ నగర్ మండల కేంద్రంతోపాటు గున్కుల్,సింగీతం,తెల్లాపూర్,నర్వ గ్రామాలలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని గునుక, తంగేడు పువ్వులను పోగుచేసుకుని బతుకమ్మలను రంగురంగులతో పేర్చి బతుకమ్మను అందంగా తయారు చేశారు. అనంతరం గ్రామచావిడి వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేసి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.మహమ్మద్ నగర్ గ్రామంలో కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దపేదర్ శోభ ఇంటి నుండి బతుకమ్మను తీసుకువెళ్లి గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసి మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులు,రిజర్వాయర్ లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. మహిళలు వెంట తీసుకు వెళ్లిన భోజనాన్ని తిన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు ,సర్పంచ్ లు పాల్గొన్నారు