Home తాజా వార్తలు గోలింగాల గ్రామంలో క్రీడా పోటీలు

గోలింగాల గ్రామంలో క్రీడా పోటీలు

by V.Rajendernath

నాగిరెడ్డిపేట , అక్టోబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల గ్రామంలో శనివారం బిక్కనూరు మండల పంచాయతీ అధికారి గోలి లింగాల వాస్తవ్యులు
ప్రవీణ్ కుమార్
తమ తల్లిదండ్రులు నిరఢీ కమల,బాలకృష్ణయ్య జ్ఞాపకార్థం మూడు రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టి పెరిగిన ఊరును ఎవరు మరిచిపోవద్దని,తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.పోటీల్లో 14 టీములు పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.క్రీడాకారులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని చెప్పారు.తమ ప్రతిభను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అనంతరం ఎస్సై రాజు మాట్లాడుతూ గ్రామంలో తన తల్లిదండ్రుల పేరుతో క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో విషయం అన్నారు.క్రీడాకారులు క్రీడలను గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని చెప్పారు.ఓటమి చెందినవారు నిరుత్సవ పడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.ప్రవీణ్ కుమార్ గ్రామాన్ని మర్చిపోకుండా తన తల్లిదండ్రుల పేరుతో క్రీడా పోటీలు నిర్వహించినందుకు పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.క్రీడలలో గెలుపొందిన గోపాల్పేట్ గ్రామ టీం విజేతగా గాజిరెడ్డిపల్లి గ్రామ టీమ్ రన్నర్గా గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిట్ల మురళి,కార్యదర్శి ప్రదీప్ గౌడ్ పలువురు నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment