మిర్యాలగూడ, అక్టోబర్ 8, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ రైస్ మిల్లర్ రేపాల మధుసూదన్ ఎన్నికయ్యారు.ఆదివారం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపాల మధుసూదన్‌ను శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు,తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి , నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడలో పరిశ్రమ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి అన్నపూర్ణగా మారిన మిర్యాలగూడ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబి), మాజీ మిల్లర్స్ అధ్యక్షులు గార్లపాటి ధన మల్లయ్య, చిల్లంచర్ల విజయ్ కుమార్, మంచుకొండ వెంకటేశ్వర్లు తోపాటు వింజం శ్రీధర్, రేపాల అంతయ్య, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, గార్లపాటి మధుసూదన్, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.