- ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి(కల్వకుర్తి)అక్టోబర్06
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
కల్వకుర్తి నియోజకవర్గం పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన& అగ్నిమాపక సేవల శాఖ నూతన అగ్నిమాపక కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, కౌన్సిలర్ కౌసల్య, సింగిల్ విండో అధ్యక్షులు జనార్దన్, వైస్ ఎంపీపీ గోవర్ధన్,వివిధ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఉన్నారు.