జిల్లాలో బిఆరెఎస్ కు కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం
బిఎస్పి పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎంవి గుణ
మంచిర్యాల, ఆగస్టు 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): బీసీలను అసెంబ్లీకి ఆవిడ దూరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపుతున్నాట్లు, బి ఎస్ పి పార్టీ మన జిల్లా అధ్యక్షుడు ఎం.వి గుణ అన్నారు. గురువారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు 115 అభ్యర్థులను ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నూటికి 64% ఉన్నటువంటి బీసీలను విస్మరించి కేవలం 23 అసెంబ్లీ సీట్లు కేటాయించడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తే తమ కుర్చీకే ఎసరు వస్తుందని గమనించిన కేసీఆర్ బీసీలను అణచివేశారు. బీసీలను అసెంబ్లీకి ఆమడ దూరం జరిపే కుట్ర జరుతోందని, బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే వినియోగించుకుంటూ చట్టసభలకు దూరం పెడుతున్నటువంటి వైనాం బిఆరెఎస్ లోని బీసీ నాయకులు గమనించాలని, బహుజన సమాజ్ పార్టీగా తెలియజేస్తున్నామన్నారు. ఒక్క శాతం ఉన్న సొంత సామాజిక వర్గానికి పదకొండు సీట్లు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో బీసీలు గమనించాలని, అందులో మంచిర్యాల నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా బీసీ ఓటర్లు ఉండగా పదివేల ఓట్లు లేని సి.యం. సొంత సామాజిక వర్గానికి సీటు కేటాయించడం దారుణమని, మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతోనే కేటాయించిన విషయం, ఒక్క చెన్నూరు నియోజకవర్గంలోనే ఇద్దరు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు ఉండటం గమనించాల్సిన విషయమని తెలియజేశారు.
రాష్ట్రంలో 50 లక్షల పైన ఉన్న ముదిరాజులకు అన్యాయం
రాష్ట్రంలో 50 లక్షలు పైన ఉన్న ముదిరాజులకు అన్యాయం చేసి ఒక్క సీటు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో యాభై లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు, ఒక్క అసెంబ్లీ సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీని బిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకు నెరవేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముదిరాజులకు దక్కాల్సిన ఫలాలను బిఆర్ఎస్ పార్టీ అమలు పరచడంలో వెనుకడుతుందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరపున ముదిరాజులకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలన్నారు.
రాష్ట్రంలో బీసీ కులాలైన చాకలి, మంగళి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి మొదలైన బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని, నూటికి తొంభై శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందని, యువకులు ఐక్యమంగా కలిసికట్టుగా ముందడుగు వేయ్యలన్నారు. ఇప్పటివరకు బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీలైన బీసీలను ఓటరుగానే గుర్తించి వాడుకుందే తప్ప చట్టసభలకు పంపిన దాఖలాలు లేదన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత రథసారథి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరికంటే ముందుగా బీసీలకు 70 సీట్లు ప్రకటించి చరిత్ర సృష్టించారన్నారు. ఈ ఘనత కేవలం ఆర్ఎస్పీ దక్కిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మహిళలకు కేవలం 6 సీట్లే కేటాయించడం విచారకరమని, మహిళలకు సుమారుగా 35 నుండి 40 సీట్లు కేటాయించాల్సిన బిఆర్ఎస్ అధినేత మహిళలకు చాలా అన్యాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంచిర్యాల జిల్లా బహుజన సమాజ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.