Home తాజా వార్తలు సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కామారెడ్డి ఎమ్యెల్యే

సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కామారెడ్డి ఎమ్యెల్యే

by V.Rajendernath

హైదరాబాద్, ఆగస్టు 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుటుంబ సమేతంగా ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 3న తమ కుమారుడు శశాంక్ వివాహం ఉంటుందని, సీఎం కేసీఆర్ కు వివరిస్తూ, కుటుంబ సమేతంగా వివాహానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేసారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన ఎమ్యెల్యే కుటుంబ సభ్యులకు రిటర్న్ గిఫ్ట్ అందించారు.

You may also like

Leave a Comment