Home తాజా వార్తలు బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

by Telangana Express

శంకరపట్నం,ఆగస్టు 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్న బిజెపి నాయకులు,కార్యకర్తలను ఉదయం 5:30 గంటలకు అరెస్ట్ చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు, ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని వెల్లడించారు, అరెస్ట్ లతో తమ ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు అంతం రాజిరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు దాసరి నరేందర్, ఎలుక పెళ్లి సంపత్,కాంతాళ రాజిరెడ్డి,మండల ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మందాటి జగ్గారెడ్డి,బీజేవైఎం మండల అధ్యక్షులు బొడిగ నరేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బోడ తిరుపతిరెడ్డి, బూతు అధ్యక్షులు వీరస్వామి, శివారెడ్డి తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment