Home తాజా వార్తలు సుడిగాలి పర్యటనతో ప్రముఖులను కలిసిన ముదిరాజ్ మహాసభ నాయకుడు పివి ఎల్ ఎం రాజు

సుడిగాలి పర్యటనతో ప్రముఖులను కలిసిన ముదిరాజ్ మహాసభ నాయకుడు పివి ఎల్ ఎం రాజు

by V.Rajendernath

సికింద్రాబాద్, ఆగస్టు 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ముదిరాజ్ మహాసభ సీనియర్ నాయకులు, మాజీ ఎన్జీఓ లీడర్, బిసి కులాల ఐక్యవేదిక వ్యవస్థాపక కోశాధికారి, తొలి తెలుగు దివ్వె – తెలుగు మూలాల అధ్యయన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు. బుధవారం ముదిరాజ్ సుడిగాలి పర్యటన చేసి ప్రముఖులను కలుసుకున్నారు. విశ్రాంత సహాయ వాణిజ్య పన్నుల అధికారి, మాజీ రాష్ట్ర ఎన్జీవో నాయకులు పివిఎల్ఎన్ రాజు ముదిరాజ్ తొలుత అఖిలభారత ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర టిడిపి పార్టీ అధ్యక్షులు, మాజీ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని అమీర్ పేట లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో ముదిరాజ్, ముత్రాచ, తెనుగోళ్లు గ్రూప్ కులాల అభ్యున్నతికి చేయవలసిన కార్యాచరణ గురించి చర్చించారు. అక్కడినుండి బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కె.వి నారాయణతో కలిసి రెండు రాష్ట్రాలలో ముదిరాజ్ కులస్తులకు జరుగుతున్న అన్యాయాలు ఎలా పరిష్కరించాలో చర్చించారు. అక్కడి నుండి ముదిరాజ్ మహాసభ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్ల సదానంద్ ముదిరాజ్ కి శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ముషీరాబాద్ లోని వారి స్వగృహానికి వెళ్లి వారిని పలకరించారు. బాగోగులు తెలుసుకున్నారు. అక్కడినుండి రాజు బాల్య స్నేహితులు, ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టులో రిజిస్ట్రార్ ఆఫ్ విజిలెన్స్ గా, ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ సెక్రటరీగా, పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా పదవులు నిర్వహించి ఇటీవల రిటైర్ అయిన సి దుర్గాప్రసాద్ ను కొండాపూర్ లోని వారి కార్యాలయంలో కలిశారు. చిత్రా రామచంద్రన్ , భర్త ఫణికుమార్ ని బంజారాహిల్స్ లోని వారి స్వగృహం నందు కలిసి యోగక్షేమాలు తెలుసుకొని ముచ్చటించారు.

You may also like

Leave a Comment