Home తాజా వార్తలు సహాయం కోసం ఎదురు చూపు

సహాయం కోసం ఎదురు చూపు

by V.Rajendernath

మంచిర్యాల, ఆగస్టు 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖ పల్లి రాళ్లపెట్ గ్రామంలో చొప్పరి కవిత భర్త చొప్పరి అశోక్ పేద కుటుంబానికి చెంది కూలి పని చేస్తూ ఈ దంపతులు జీవనం కొనసాగిస్తున్న సమయంలో భార్య కవితకు గత మూడు సంవత్సరాల నుండి రెండు కిడ్నీలు సహకరించక పోవడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం చొప్పరి అశోక్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి భార్య కవిత రెండు కిడ్నీలు సహకరించకపోవడంతో 2020 మే 02, ప్రభుత్వ మాతాశీశు, శచల్మెడ ఆనందరావు, కేల్మిని, కరీంనగర్, మ్యాటర్నీటీ దవఖాన సూర్య డయగ్రోస్టిక్స్ హనుమకొండ, హైదరాబాద్ లోని యశోద, నిమ్స్, గాంధీ దవాఖానాలో మెరుగైన వైద్యం కోసం 15 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వచ్చిన భార్య కవిత పూర్తిగా బాగుపడడం లేదన్నారు. డాక్టర్లు భార్య కవితకు డైయలాసిస్ జరగాలని డాక్టర్లు చేస్తూ ఉన్న శరీరం నాలుగు భాగాలలో చేయి మెడ గుడి ఎడమ కాలు తొడ పొట్ట ద్వారా ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం జరిగిందన్నారు మెరుగైన వైద్యానికి డబ్బులు లేక హైదరాబాద్ వెళ్లలేక మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవఖానలో డైయలాసిస్ జరుపుకొని ప్రస్తుతం బెల్లంపల్లి కెమికల్ ప్రభుత్వ దవఖానలో డయలాసిస్ జరిగే శరీర భాగం భార్య కవితకు లేదని ప్రభుత్వ వైద్యులు తెలిపారన్నారు. భార్య కవితకు డైయలాసిస్ ట్వీబ్ ద్వారా జరుపవచ్చని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యులు తెలిపారన్నారు. భార్య కవిత శరీర చేయి, భాగంలో ట్వీబ్ ద్వారా డైయలాసిస్ జరగాలంటే రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అన్నారు. భార్య కవిత డైయలాసిస్ జరగాలంటే, మా గ్రామం చాకపల్లి (రాళ్లపేట్) నుండి బెల్లంపల్లి ప్రభుత్వ కెమికల్ దవాఖానకు ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేని దీన స్థితిలో ఉన్నామన్నారు. (కవితకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి కలపోషణకే కష్టపడి సంపాదించిన డబ్బులు సరిపోవడం లేదన్నారు) ఎవరైనా దాతలు ఉంటే డైయలాసిస్ జరుపుకోనుటకు సహాయం చేయగలరని చొప్పరి కవిత భర్త అశోక్ కోరుతున్నారు ఆర్థిక సహాయం ఈ సెల్ నెంబర్, 7207395033 అకౌంట్, 006810100290530 కు, అందజేయవలేనాని, ఎవరైనా తమకు దోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేయాలని వేడుకుంటున్నారు.

You may also like

Leave a Comment