బిచ్కుంద ఆగస్టు 16:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో స్థానిక బోయవాడకు చెందిన బర్ల సునీత వయసు 35 సంవత్సరాలు వృత్తి వ్యవసాయ కూలీ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది కాగా మృతురాలికి ఇంతకు మునుపే పుల్కల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమై కుమారుడు ఉండగా కుటుంబ కలహాలతో విడాకులు తీసుకొని జుక్కల్ మండలం మమదబాద్ గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొగ వీరికి ఒక కుమార్తె కలదు ఇటీవల కుటుంబంలో మనస్పర్దాల మధ్య గొడవలు జరగడంతో భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి మేనమామ ఫుల్ కంటి బాలబోయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మురళి తెలియజేశారు