ఎల్లారెడ్డి, ఆగస్టు 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో, బుధవారం విద్యుత్ తీగలకు అడ్డు ఉన్న చెట్టు కొమ్మలను ట్రాన్స్ కో సిబ్బంది తొలగించారు. గ్రామంలోని స్ట్రీట్ లైన్ కు విద్యుత్ దీపాలు రెండు రోజులుగా వెలగడం లేదని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గాదె లక్ష్మి బాలయ్య ట్రాన్స్ కో అధికారులకు తెలియ జేయడంతో, లైన్ మెన్ ఏండి. గౌస్, జేఎల్ఎం ఎల్లయ్య లు గ్రామంలోని విద్యుత్ లైన్ లను పరిశీలించి, రోడ్డు ప్రక్కన విద్యుత్ లైన్ కు పెద్ద వేప చెట్టు కొమ్మలు అడ్డు తగిలి స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని తెలుసుకుని, గ్రామ పంచాయతీ వర్కర్ల సహాయంతో అడ్డుగా ఉన్న కొమ్మలను చెట్టు పైకి ఎక్కి తొలగించి స్ట్రీట్ లైన్ విద్యుత్ లైట్లు వెలిగేలా పునరు ద్ధరించారు.