సురక్ష పోలీస్ కళ బృందం ఆధ్వర్యంలో
కృష్ణ. ఆగస్టు 16 :- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలం గుర్జాల్ గ్రామంలో బుధవారం
సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు గ్లాసుల విధానం బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడకంతో వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగుచేసిన అమ్మిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీ.ఈ.ఐ.ఆర్ నూతన అప్లికేషన్ సెల్ఫోన్ తిరిగి పొందవచ్చని అవగాహన కల్పించారు.అత్యవసర సమయంలో డయల్ 100కు ఫీన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.