ఎల్లారెడ్డి, ఆగస్టు15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే గా గెలిచిన గత నాలుగున్నర సంవత్సరాలలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేసిన నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గంపై ఎనలేని దొంగ ప్రేమను చూపారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు ఎల్లారెడ్డి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోటీ చేయడానికి కేసీఆర్, కేటిఆర్ లను సంప్రదించి ఎన్నికల్లో పోటీచేసి గెలిచి, ప్రజలను మోసం చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు అని ఆరోపించారు. ఇన్ని రోజులుగా గుర్తుకు రాని నియోజకవర్గం ఇప్పడు కేటీఆర్ ఎందుకు గుర్తొచ్చింది అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందా అని
నేటి వరకు నియోజకవర్గంలో ఒక్క డబల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి జాడే లేదని అన్నారు. పంట నష్టపోయిన రైతుల కోసం బహిరంగ సభలో మంత్రి అసలే ప్రస్తావన చేయలేదు,
భూంపల్లి డ్యామ్ పూర్తి చేస్తామన్నా హామీని తుంగలో తొక్కిన ఎమ్మెల్యే , అభివృద్ధిపై బహిరంగ శ్వేత పత్రం విడుదల చేయాలి అని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి చెన్న లక్ష్మణ్, సయ్యద్ ఆరిఫ్, క్రిస్టోఫర్, నారా గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అజర్, నాయకులు సంతోష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.