మంచిర్యాల, ఆగస్టు 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో స్థానిక పోలీసుల బందోబస్తు నడుమా, 77వ స్వతంత్ర దినోత్సవం లోకి ప్రవేసిస్తున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ ఘనంగా జాతీయ జెండా పథకాన్ని ఎగురవేశారు. మంగళవారం జిల్లాలో వివిధ కార్యాలయాల్లో అభివృద్ధి పనులు చేసిన సక్రమంగా విధులు నిర్వహించిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు, భారత దేశ స్వతంత్రం కోసం పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్రం తెచ్చిన సమరయోధుల అడుగుజాడల్లో నడిచి భారతదేశాన్ని కాపాడుకోవాలన్నారు. భారతదేశమంటే భిన్నత్వంలో ఏకత్వమని, దేశ ప్రజాస్వామ్యంలో అందరమూ ఒకటే అందరికీ అన్ని హక్కులు ఉన్నాయాన్నారు. ఆ హక్కుల సాధనలో సమరయస్యంగా ఎలాంటి భేదభావాలు లేకుండా దేశ పౌరులంతా భారతదేశాన్ని ముందుకు సాగించ్చాలన్నారు. కేంద్ర, రాష్ట్రం సామాన్య ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు, రాష్ట్రంలో జిల్లాలో మండలంలో గ్రామాలలో పేదలకు అందించి, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిపి సమాజన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 77 వ సంవత్సరం వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరయ్యారు. జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తూ, అభివృద్ధిలో ప్రతిభ కనబరిచిన వారికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ సంతోష్
49
previous post