జుక్కల్ ఆగస్టు 15:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం,మద్నూర్ మండల కేంద్రం లోని ఇందిరా క్రాంతి పథకం కార్యాలయం లో 77వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఏ పి ఓ నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండా కు అవమానం జరిగింది. జాతీయ జెండాను అవమానకరంగా ఎగురావేసి తమ నిర్లక్ష్యన్ని మరొమారు స్పష్టం చేసుకున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాషాయపు వర్ణన్ని పైన ఉండాలి కానీ ఏ పి ఓ నిర్లక్ష్యం తో తలకిందులుగా జాతీయ జెండాను ఎగురావేసి తన జాతీయతాను చాటుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని, విద్యార్థుల సాక్షి గా జాతీయ జెండాకు అవమానం జరగడం తో సంబంధిత అధికారులు ఏ పి ఓ పై తాగు చర్యలు తీసుకోవాలని పలువురు తమ అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వతంత్రo తెచ్చి పెట్టితే అలాంటి వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన స్వతంత్ర వేడుకలు కాస్త ఇలాంటి వ్యక్తుల కారణంగా జాతీయ జెండా కు అవమాన పర్చడం పట్ల ప్రత్యేక్ష సాక్షులుగా అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు సిగ్గుతో తలదించుకొని వేణుదిరిగి పోయారు.