Home తాజా వార్తలు అర్హులైన బీసీలకు బీసీ బందు చెక్కులు అందజేత

అర్హులైన బీసీలకు బీసీ బందు చెక్కులు అందజేత

by V.Rajendernath

మంచిర్యాల, ఆగస్టు 11, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అర్హులైన బీసీలకు బీసీ బందు చెక్కులను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష నాయక్, స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో బీసీ బందు మొదటి విడత అర్హులకు సభ్యుల లక్ష రూపాయల చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యే అందించారు. రాష్ట్రంలో బీసీ బందు దరఖాస్తు చేసుకున్న వారందరికీ బీసీ బంద్ అమలు పరచడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో బిసి బంధు ప్రతినెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు బిసీలందరు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బీసీ లందరికీ బీసీ బందు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మండల పరిషత్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీసీ బందు పొందే సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment