Home తాజా వార్తలు ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయల్లోకి వచ్చాను

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయల్లోకి వచ్చాను

by V.Rajendernath

రిటైర్డ్ జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ రాంకిషన్

మంచిర్యాల, ఆగస్టు 11, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : ఖానాపూర్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయల్లోకి దిగుతున్నానని త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మండలంలోని ధర్మారం తండాకు చెందిన రిటైర్డ్ ఇండిస్ట్రీయల్ జనరల్ మేనేజర్ జాదవ్ రాంకిషన్ నాయక్ అన్నారు.శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రెస్ క్లబ్ విలేఖరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసినప్పుడు యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో తన వంతుగా కృషి చేశానని, ఖానపూర్ నియోజక వర్గంలో నాన్ లోకల్ వాళ్లే రాజ్యమేలు తున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో స్థానికులకే ప్రజలు ఎమ్మెల్యే గా ఆవకాశం ఇవ్వాలని కోరారు. ఖానాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ను ఆశిస్తున్నానని, ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశానని అన్నారు. స్థానికున్ని కాబట్టి తనకు నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై అవగాహన ఉందని, త్వరలోనే అన్ని మండలాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చౌహన్ రాంనాయక్, పున్నం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment