Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by V.Rajendernath


వేములపల్లి,ఆగస్టు11(తెలంగాణ ఎక్స్ ప్రెస్)రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మడలలోని సల్కునూరు ఎక్స్ రోడ్డు వద్ద జరిగింది. మొదటి బంధువులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన గామల్ల తిరుమలేష్ (25) వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సల్కునూరు ఎక్స్ రోడ్డు వద్ద బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

You may also like

Leave a Comment