మద్నూర్,ఆగస్టు11,తెలంగాణ ఎక్స్ ప్రెస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో శుక్రవారం నాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా జై గౌడ్ సంఘం మండల సంఘాలు నాయకులు గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని జయంతి . సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర భావితరాలకు ఆచరణీయమన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఇప్పటివరకు 16 సార్లు జై గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఈనెల 13న రవీంద్ర భారతి లో జరిగే జయంతి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి గౌడ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ లో కామారెడ్డి జిల్లా జైగౌడ్ జిల్లా అధ్యక్షులు బొంబోతుల లింగగౌడ్, మద్నూర్ సురేష్ గౌడ్, పల్లె రమేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి గౌడ్, అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, తూప్రాన్ ప్రకాష్ గౌడ్, తాటిపాముల బాబాగౌడ్ పాల్గొనడం జరిగింది.
మద్నూర్ లో సర్ధార్ సర్వయి పాపన్న జయంతి గోడ పోస్టర్లు ఆవిష్కరణ
39
previous post