Home Epaper నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసి బోరు, బావుల కింద నారుమడులను కాపాడాలి

నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసి బోరు, బావుల కింద నారుమడులను కాపాడాలి

by Telangana Express
  • సాగర్ ఎమ్మకాలకు నీటిని విడుదల చేయాలి తమ్మడబోయిన అర్జున్

మిర్యాలగూడ, ఆగస్టు11 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోరు బావులు కింద రైతులు వ్యవసాయంచేసుకుందామంటేమిర్యాలగూడ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా సింగిల్ ఫేస్ త్రి ఫేస్ కరెంటు సక్రమంగా సరఫరా కాకపోవడంతో నారుమడులు ఎండిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,రైతాంగం సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి త్రీ ఫేసు సింగల్ ఫేస్ కరెంటు లేక రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి పూట కరెంటు లేకపోవడం తో పొద్దంతా పనికి పోయి వచ్చి రాత్రి నిద్ర పోవాలంటే దోమలు విపరీతంగా దాడి చేసి కుట్టడం వల్ల పెద్దలు,చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని,దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా రోగాల బారిన పడుతున్నారని అన్నారు.నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు విడుదల చేయకపోవడంతో, ఆయకట్టులో నారుమళ్ళు ఎండిపోతున్నాయన్నారు.సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.రైతులకు పూర్తిగా రుణమాఫీ తక్షణమే ఇవ్వాలనిడిమాండ్ చేశారు.లేనిపక్షం లో బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ర పోల గాని వెంకటేష్ గౌడ్, ఊట్లపల్లి సర్పంచి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరెల్లినగేష్,భారీ,పాండు,వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment