మిర్యాలగూడ, ఆగస్టు 11 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ శుక్రవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిల్లంచర్ల అభి బీజేవైఎం మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ పెదమాం భరత్ మాట్లాడుతూఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది అభ్యర్థులకు ఒకే నెలలో జేఎల్, గురుకుల తదితర పరీక్షలు ఉండటం, అన్ని పరీక్షలు నెలన్నర సమయంలో నిర్వహించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. గ్రూప్ 2 లో కొత్త సిలబస్ ను చేర్చడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ కు సమయం సరిపోదని,గతంలో పేపర్ లీకేజీ కారణంగా రెండు, మూడునెలలుఅభ్యర్థులందరూ మానసిక ఒత్తిడికిలోనై చదువుకు దూరమయ్యారన్నారు.టి ఎస్ పి ఎస్ సి బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షలనియమాలను తప్పుల తడక గా మార్చి ప్రతిసారి నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థుల ఆకాంక్షల మేరకు గ్రూప్2 పరీక్షను మూడు నెలల సమయం ఇచ్చి ఆ తరువాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కార్యాలయ డిఏఓ. రాధకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ నాయక్, పట్టణ అధ్యక్షులుదొండపాటి వెంకటరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత బిజెపి ఫ్లోర్ లీడర్ చిలుకూరి శ్యామ్ రమాదేవి, శేఖర్, మేడి నవీన్, అశోక్, యువమోర్చా నాయకులు నరేష్, రమేష్ నాయక్,శివ, అజయ్, శంకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలంటూ బి జె వై ఎమ్ ఆందోళన
29