Home Epaper సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ..

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ..

by Telangana Express

పెద్ద కొడప్గల్, ఆగస్టు 11:- (తెలంగాణా ఎక్స్ ప్రెస్):- మండల కేంద్రంలో శుక్రవారం జై గౌడ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు లింగాగౌడ్ మాట్లాడుతూ, బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిస్తూ ఈనెల 13వ తేదీన రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహిస్తున్న పాపన్న జయంతిలో అందరూ గౌడ సభ్యులు యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా గౌరవ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సభ్యత్వాన్ని ప్రతి గౌడ సోదరుడు సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. సభ్యత్వ కార్యక్రమం అనంతరం ఈనెల 27వ తారీకు నాడు కౌంటింగ్ ద్వారా గౌడ సంఘం జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని, అందరూ సభ్యత నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి గౌడ్, పల్లె రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తూప్రాన్ ప్రకాష్ గౌడ్, జనార్ధన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, నిఖిల్ గౌడ్, శంకర్ గౌడ్, సాయ గౌడ్ హనుమ గౌడ్, ప్రవీణ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పండరి గౌడ్, మండల అధ్యక్షులు విట్టల్, గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, సభ్యులు నర్సాగౌడ్, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment