Home తాజా వార్తలు బీజెపీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలి….బీజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార

బీజెపీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలి….బీజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 10,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ నీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కలిసికట్టుగా కృషి చేయాలని, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, బీజెపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. గురువారం ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో బీజెపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదురుగా బీజెపీ జెండాను పట్టణ అధ్యక్షులు కుషలకంటి సతీష్ చే అవిష్కరింప చేసిన అనంతరం అరుణతార రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆతర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధిష్టానం టికెట్ ఎవ్వరికి ఖరారు చేసిన గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సైనికుల్లా గా కృషి చేయాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ సర్కార్ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 3 రోజుల గడువు పెట్టడంతో జీరాక్స్ సెంటర్ల వద్ద, మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు అని అవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే వైన్స్ షాపుల టెండర్ల కోసం 18 రోజుల గడువు పెట్టడం చూస్తుంటే సర్కార్ కు ఆదాయ పద్దు పై ఉన్న ధ్యాస ప్రజల సంక్షేమం పై పెట్టాలని అన్నారు. అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బిసిలకు లక్ష ఆర్థిక సహాయం అర్ధాంతరంగా అగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బిజేపి రాష్ట్ర ఓబీసీ నాయకులు బైండ్ల పోచన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు, బిజేపి రాష్ట్ర నాయకులు , ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ బత్తినీ దేవేందర్, జిల్లా నాయకులు మర్రి బాలకిషన్, జుక్కల్ నియోజక వర్గ బిజేపి సీనియర్ నాయకులు రాము సెట్, బిజేపి బిజేపి పట్టణ అధ్యక్షులు కుశలకంటి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబా, పట్టణ కార్యదర్శి రాజేష్, బిజేవైఎమ్ మండల,పట్టణ అధ్యక్షులు నరేష్ పికె, శంకర్, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment