Home తాజా వార్తలు గ్రామపంచాయతీ కార్మికులపైన ప్రభుత్వం నిర్లక్ష్యం

గ్రామపంచాయతీ కార్మికులపైన ప్రభుత్వం నిర్లక్ష్యం

by Telangana Express

జిల్లా జిపి జెఎసి అధ్యక్షులు కొప్పుల శంకర్

సైదాపూర్ ఆగస్టు 2
(తెలంగాణ ఎక్స్ ప్రెస్: )

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తున్న 28వ రోజులకు సందర్భంలో గ్రామపంచాయతీ కార్మికులకు జిల్లా గ్రామ పంచాయతీల జిల్లా జేఏసీ అధ్యక్షులు కొప్పుల శంకర్ మండల అధ్యక్షులు మలుగూరి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో రాష్ట్రవ్యాప్త సమ్మెకు ముఖ్యఅతిథిగా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల పైన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సూచన పేరుతో మళ్లీ మళ్లీ వస్తుందని ఇందులో పనిచేస్తున్న వారంతా దళితులు గిరిజనలు మైనార్టీలు బీసీలు పనిచేస్తున్నారు కావున ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వెంటనే రాష్ట్ర దేశ నాయకులను చర్చలోకి పిలవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చిన 14 ను డిమాండ్లను వెంటనే చర్చించి అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిపి గ్రామ గ్రామ పంచాయతీల జేఏసీ అధ్యక్షులు కొప్పుల శంకర్ సైదాపూర్ మల్టీపర్పస్ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు మలుగూరి ప్రేమ్ కుమార్ రాజు చంద్రశేఖర్ శంకర్ నాయక్ పోడిశెట్టి సారయ్య బాబన్న పైడిపల్లి కుమార్ మోలుగురు సదయ్య సుంకర సంపత్ కొమ్ముల బిక్షపతి కలకోటి కిషోర్ దాసరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment