Home తాజా వార్తలు విశ్వబ్రాహ్మణులను విస్మరిస్తున్న ప్రభుత్వం!

విశ్వబ్రాహ్మణులను విస్మరిస్తున్న ప్రభుత్వం!

by Telangana Express

శంకరపట్నం,ఆగస్టు02:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర కీలకం, ప్రొఫెసర్ జయశంకర్ నుండి కాసోజు శ్రీకాంతాచారి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు,విశ్వబ్రాహ్మణులలో, వడ్రంగి,కమ్మరి, స్వర్ణకారులు,కంచరి, శిల్పి కాశి అని ఐదు కులాలు ఉంటాయి, బీ,ఆర్,ఎస్,ప్రభుత్వం ఏర్పాటై పది సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి సహాయం చేయలేదు, పైగా త్యాగాలు చేసిన మాపైనే ఫారెస్ట్ ఆఫీసరుల తోటి,పోలీసులతో, దాడులు చేయిస్తూ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి 250 కోట్లు కేటాయించాలని అలాగే సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, విశ్వబ్రాహ్మణులకు 50సం,,రాల నిరుపేదలకు 3000 రూ పింఛన్ కొరకు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొర పెట్టుకున్న నేటికి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు,గతంలో రజక,నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ మీటర్లు అందించినట్లుగా విశ్వబ్రాహ్మణులకు కూడా విద్యుత్ మీటర్లు అందించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు, గతంలో 2017-18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ లోన్ ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికిని కూడా తుంగలో తొక్కి, ఎన్నికలు సమీపిస్తుండడంతో తాజాగా నెల రోజుల క్రితం బీసీ చేతి కుల వృత్తుల ఒక లక్ష రూపాయల పథకం కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నప్పటికిీ, ఆ జాబితాలో విశ్వబ్రాహ్మణులను వెనుకకు నెట్టి వేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు, ఇప్పటికైనా బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ప్రత్యేక చొరవతో మమ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment