వరద బాదితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల
-కేబినెట్ నిర్ణయాల పట్ల హర్షం
సైదాపూర్ ఆగస్టు 02 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలతో నష్టపోయిన జిల్లాల బాధితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం పట్ల సైదాపూర్ మండల భారత రాష్ట్ర సమితి మండల శాఖ అధ్యక్షులు సోమారపు రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి విలయానికి నష్టపోయిన ప్రజల పట్ల ప్రభుత్వం, సీఎం కెసిఆర్ మానవీయంగా వ్యవహరించారు. ఈ నిర్ణయం రైతులకు లబ్ధి కూరే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. సీఎం కెసిఆర్ కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి, రాబోవు కాలంలో దేశానికి సీఎం కెసిఆర్, బిఅర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని అన్నారు. రాష్ట్రంలో సీఎం కెసిఆర్ చేస్తున్న ప్రజాసంక్షేమంను చూసి దేశంలో కూడా బిఅర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.