రేగోడు జులై 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్. రేగోడు మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ మండల స్థాయిలో అత్యధిక విద్యార్థులతో మంచి విద్య విధానంతో ముందుకు సాగుతుంది. రేగోడు మండలంలో నీ మోడల్ స్కూల్ కు గత కొన్ని సంవత్సరాల కిందట గర్ల్స్ హాస్టల్లో మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా బిల్డింగు నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారు. దానికి కొనసాగింపులో భాగంగా రెండవ విడతగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చొరవతో తెలంగాణ స్టేట్ డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ నిధుల నుండి 30 లక్షల రూపాయలను గర్ల్స్ హాస్టల్ నిమిత్తం మంజూరు చేయించడం జరిగింది. దీనివల్ల తొందరగా హాస్టల్ భవనం పూర్తయితే మండలంలో ఉన్న బాలికలకు మంచి వసతిగృహం నిర్మాణం జరిగితే, మోడల్ స్కూల్ లో చదువుతున్నటువంటి విద్యార్థినిలు అందరూ మంచి నాణ్యతతో కూడిన విద్యతో ముందుకు వెళ్తారని మండల ప్రజలు అంటున్నారు. మోడల్ స్కూల్ హాస్టల్ పూర్తి కావడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు రేగోడు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ద్వారా డిఎంఎఫ్ నిధులు
రేగోడు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కు 30 లక్షలు
హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు
32