Home తాజా వార్తలు మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలి అని ప్రజా సంఘాలు

మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలి అని ప్రజా సంఘాలు

by Telangana Express

వేములపల్లి, జులై 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)మణిపూర్ ఘటనలను నిరసిస్తూ,బీజేపీ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ వెంటనే అక్కడ శాంతిని నెలకొల్పాలని సోమవారం నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వేములపల్లి మండల కేంద్రంలోని క్యాంపులో మణిపూర్ ఆదివాసీ ప్రజలకు నిరసన తెలియజేసి సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పాదూరు గోవర్థన మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య హింసాకాండ చెలరేగుతూ అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన కూడా అక్కడి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం గానీ,కేంద్ర ప్రభుత్వం గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.ఇటీవల ఆదివాసీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం సభ్య సమాజం తలదించుకునే చర్య అన్నారు.పార్లమెంట్ లో సమావేశాల్లో రాజ్యసభ విపక్ష సభ్యులు మణిపూర్ ఘటనలపై చర్చలు జరిపాలంటే సభలు వాయిదా వేయడం ప్రధాని మోడీ చేతగానితనానికి నిదర్శనం అన్నారు.వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే అక్కడికి వెళ్ళి చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్,ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య,డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, నాయకులు వడ్డెగాని సైదులు,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment