తెలంగాణను మరో మణిపూర్ గా మార్చాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ
లంబడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ధనవత్ సిద్దు నాయక్
మిర్యాలగూడ డివిజన్ జూలై 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్: స్థానిక మిర్యాలగూడ లో రాగ్య నాయక్ విగ్రహం ఎదుట దిష్టి బొమ్మను L.H.P.S ( లంబడి హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దనవత్ సిద్దు నాయక్ మాట్లాడుతూ కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి మరొకసారి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలనీ *సోయం బాబురావు కేంద్రమంత్రికి బంజారా లంబాడి బిడ్డలను గిరిజనుల జాబితా నుండి తొలగించాలని లేఖ రాయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ వెనుక ఉన్న భారతీయ జనతా పార్టీ అంతు చూస్తాం,బంజారా పవర్ ఏంటో చూపిస్తాం. బిజెపి పార్టీ నాయకులని ఏ తండాలో తిరగనీయం సిగ్గు,శరం ఉన్న బిజెపి పార్టీలో ఉన్న బంజారా (లంబాడి) నాయకుల్లారా ఇకనైనా మేల్కొని రాజీనామా చేయండి, బంజారా బిడ్డల వైపు నిలబడండి లేకుంటే మిమ్మల్ని తండా నుంచి తరిమి తరిమి కొడతారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే దీనిపైన సమాధానం ఇవ్వాలి, లేదంటే, లక్షలాదిమందితో లంబాడి ప్రజలు బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం. బంజారా యువతి, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా ఉద్యోగులారా అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి సోయం బాబురావు యొక్క ఆలోచనని పసిగట్టండి, ఇలాంటి చీడపురుగులు ఉన్నారు కాబట్టే మన మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో LHPS నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దనవత్ చందు నాయక్, బాలు నాయక్,సందీప్ నాయక్,చంటి నాయక్,నిలేష్ నాయక్,అవినాష్ నాయక్,మల్సూర్ నాయక్,పవన్ నాయక్, సురేష్ నాయక్,లిట్టు నాయక్,రాము నాయక్,తదితరులు పాల్గొన్నారు.